ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|

0
276

మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా   వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్  రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని మహారాజ్ చిత్రపటనికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన చత్రపతి శివాజీ మహారాజ్  జీవితం, ఆలోచనలు, పరిపాలనా దూరదృష్టి యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశభక్తి, న్యాయపాలన, ప్రజాహితమే మహారాజ్  లక్ష్యమని, ఆ ఆదర్శాలను నేటి తరాలు ఆచరణలో పెట్టాలని కోరారు.

 

శివాజీ సేవా సమితి సభ్యులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రతి ఆదివారం వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, బస్ స్టాప్‌లు మరియు వివిధ ప్రదేశాలలో స్వయంగా వండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే  తెలిపారు. వారి సేవాభావాన్ని కొనియాడుతూ సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు రవి నాయక్, గోపాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శివారం నాయక్, తిరుపతి నాయక్, తులసి రామ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సురేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, పవన్, జమ్మిదార్ ముత్యాలు, రాజు మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 
అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు!  అమెరికాలోని మేరీల్యాండ్...
By Gadiyapudi Narendra 2026-01-05 17:44:44 0 263
PRAGATI
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By PRAGATI 2025-04-30 04:55:42 0 4K
Andhra Pradesh
పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు
*పూర్ణాహుతితో వైభవంగా*   *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*        ...
By Rajini Kumari 2025-12-15 10:54:18 0 231
Andhra Pradesh
​బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి.
మదనపల్లిలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం...
By Pagadala Venkateswar 2026-02-25 07:43:53 0 198
Andhra Pradesh
పుంగనూరు: పోలీసుల అదుపులో నిందితుడు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మార్కెట్ యార్డు వద్ద శనివారం సాయంత్రం టమాటా లోడ్ కోసం వచ్చిన ఇద్దరు...
By Kothuru Murali 2026-05-16 16:01:07 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com