పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు

0
231

*పూర్ణాహుతితో వైభవంగా* 

 *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*

                

 

 

 విజయవాడ దుర్గ గుడి, డిసెంబర్ 15. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఐదవ రోజు సోమవారం పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

దేవస్థానం స్థానాచార్యులు శివ ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడింది. ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో భవానీ దీక్షలు శుభప్రదంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి 

వి.కె. సీనా నాయక్ ముఖ్య పండుగ అధికారి మూర్తి ( ద్వారకా తిరుమల), ట్రస్ట్ బోర్డు సభ్యులు దుర్గమ్మ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. *పూర్ణాహుతి అనంతరం పండితులు, అర్చకులు భక్తులకు, అధికారులకు వేద ఆశీర్వచనం అందించారు*

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:30:14 0 77
Telangana
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం...
By Chunarkar Jagadeesh 2026-08-12 16:56:09 0 190
Andhra Pradesh
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-09 12:36:06 0 204
Telangana
Cabinet meeting
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ Revanth Reddy అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు...
By G k Nookala 2026-02-23 05:15:03 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com