నులిపురుగుల నివారణ పై అవగాహన

0
244

*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*

  ******************************

మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోతినేని మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజం కోసం, పిల్లల మంచి ఆరోగ్యం కోసం నులిపురుగుల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేపట్టిందన్నారు. చిన్నపిల్లలు రక్తహీనత, నీరసం, కడుపునొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యల బారిన పడుతున్నారన్నారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందన్నారు. మాత్రలు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులు భోజనానికి ముందు, టాయిలెట్స్ కు వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రపరచుకోవటం వంటి ఆరోగ్య సూత్రాలను హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అనూష పిల్లలకు తెలియజేయడం అభినందనీయమన్నారు. హైస్కూల్లో ఎనిమిది వందల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారన్నారు. విద్యార్థులు వైద్యుల సూచనలను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజం గౌరవించే వ్యక్తులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎమ్ఓ డాక్టర్ సుజాత, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరావు, హెల్త్ సెంటర్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
By Pagadala Venkateswar 2026-01-28 10:32:39 0 175
Andhra Pradesh
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-08-04 23:45:03 0 149
Meghalaya
Meghalaya Advances Infrastructure and Investment Growth
Meghalaya is accelerating infrastructure development and attracting new investments to strengthen...
By Fathima Safa 2026-07-01 10:47:38 0 89
Andhra Pradesh
కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ
కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని...
By Ratna Sekhar 2026-02-13 05:39:20 0 521
Telangana
అధికార అతి.. ప్రభుత్వానికి కోర్టు గతి.|
● కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ● నోటీసులు లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి...
By Sidhu Maroju 2026-07-31 12:40:03 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com