పల్లిపేటలో భారీ అగ్నిప్రమాదం – ఇల్లు పూర్తిగా దగ్ధం
Posted 2026-02-14 14:41:06
0
517
కాకినాడ : కరప మండలం పల్లిపేట గ్రామంలో శుక్రవారం వంటగదిలో గ్యాస్ లీక్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టా విష్ణు, సూర్యావతి దంపతులకు చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బాధితుల వివరాల ప్రకారం సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వలలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాకినాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్...
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో...
ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాపిడి సురేష్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...