దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

0
215

ప్రకటన

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 14:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామి వార్లకు శనివారం ఉదయం పద్మశాలీ ప్రతినిధులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. రానున్న మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళగిరి బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించబడింది.

శనివారం ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్న సంఘ సభ్యులు, చేనేత కళాకారులు నైపుణ్యంతో రూపొందించిన మంగళగిరి పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు: అవ్వారు శ్రీనివాసరావు, మరియు గూడపాటి వెంకట సరోజినీ దేవి 

జీవీ నాగేశ్వరరావు, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, మోరు స్రావణి, పద్మావతి ఠాకూర్, పనబాక భూలక్ష్మి, పెనుమత్స రాఘవరాజు, సుబ్రహ్మణ్య కుమార్ ఏలేశ్వరపు, సుకాసి సరిత, తంబళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పుల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులు మార్తి రామబ్రహ్మం, వెలగపూడి శంకర్ బాబు హాజరై, స్వామివార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమములో పాల్గొనటం తమకు భాగ్యం కలగడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్
కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని...
By Ratna Sekhar 2026-02-12 08:38:50 0 391
Andhra Pradesh
కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన...
By Ratna Sekhar 2026-03-08 17:37:15 0 1K
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
By Kothuru Murali 2026-06-13 15:49:49 0 114
Andhra Pradesh
ద్రాక్షారామంలో కాళేశ్వర స్వామి శివలింగం ద్వమ్సాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం
దాక్షారామం లో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ...
By Rajini Kumari 2026-01-10 13:14:30 0 216
SURAKSHA
Milind Dumbere IPS: Advancing Public Safety
A senior Indian Police Service officer serving as the Deputy Inspector General of Police for the...
By Lokeshwari Panthadi 2026-07-27 13:37:32 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com