లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.

0
200

లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పాలెంకొండకు చెందిన పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి వాట్సాప్‌ ద్వారా లేఖ రాసింది. 1991లో సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరు చేయబడిందని, ప్రస్తుతం 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆమె తెలిపింది. ఇదే పల్లెలో వైసీపీ నేత ఒకరు పాఠశాల ఆవరణలోని 2కుంటల స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రలు పన్నారని, కొండ నీళ్లను పాఠశాల ఆవరణలోకి మళ్లించాడని, బయో ఫెన్సింగ్‌ మొక్కలను ఆవులతో మేపించేశాడని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పాఠశాల మూతపడితే స్థలాన్ని ఆక్రమించడం సులువు అవుతుందని భావించి టీచర్లను బెదిరిస్తున్నారని తెలిపింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని పాఠశాల స్థలానికి రక్షణ కల్పించి, పాఠశాల మూతపడకుండా చూడాలని కోరింది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
By Sadaq Sadaq 2026-05-01 14:55:50 0 185
Uttarkhand
Uttarakhand Strengthens Agriculture and Horticulture
Uttarakhand continues to strengthen its agriculture and horticulture sectors through initiatives...
By Fathima Safa 2026-06-27 07:40:36 0 89
Andhra Pradesh
20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.
మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:24:06 0 199
Andhra Pradesh
కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
 చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ...
By Shyamala Yadagiri 2026-03-14 05:26:27 0 365
Prop News
From Visibility to Vision: Join the PROPIINN
PROPIINN Is a Real Estate Movement, Not Just a Marketplace Real estate is no longer just about...
By Bharat Aawaz 2025-06-26 05:47:04 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com