Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు.

0
485

 

Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు

14-02-2026 Sat 10:47 | Andhra

Andhra Pradesh Budget 2024 Prayers Offered at Kanaka Durga Temple

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఇంద్రకీలాద్రిలో బడ్జెట్ ప్రతులకు వేద పండితులతో పూజలు

బడ్జెట్ రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను అమ్మవారి పాదాల చెంత ఉంచి వేద పండితులతో పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి బడ్జెట్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

 

 

ఆ తర్వాత, బడ్జెట్ ప్రతులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు అందజేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్నారు.

 

 

ఈ బడ్జెట్ సుమారు రూ.3.46 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బడ్జెట్ ప్రజలందరికీ మేలు చేకూర్చాలని అధికారులు అమ్మవారిని ప్రార్థించడం గమనార్హం

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’...
By Pagadala Venkateswar 2026-07-20 11:34:55 0 120
Andhra Pradesh
శుభారాం డిగ్రీ కాలేజీలో ముందుగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు
పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు...
By Kothuru Murali 2026-01-07 02:34:59 0 208
Telangana
భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్
వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి,...
By Kodam Prasad 2026-03-17 08:34:28 1 2K
Telangana
ఈ రోజు ఉదయం 9 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‎ "చలో కొండ పోచమ్మ సాగర్"
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్...
By Ponnala Srinivasrao 2026-07-17 03:11:43 0 198
Andhra Pradesh
పుంగనూరు: పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి: ఎం వి ఐ
పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్...
By Kothuru Murali 2026-06-09 13:38:32 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com