అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.

0
581

గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు తరుపున దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌పై గురువారం స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో వాదనలు వినిపి ంచనున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలపై న్యాయవాదులు, లీగల్‌ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. నిజానికి అంబటి రాంబాబు జైలుకు వెళ్లేంత తీవ్రమైన నేరంచేశారా? అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. ఈకేసు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సిన నేర విభాగానికి చెందినదిగా న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో చట్టపరంగా సెక్షన్‌ 41 నోటీసులు ఇవ్వడమే సాధారణ విధానమని లీగల్‌నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం, కస్టడికి అప్పగించాలంటూ పిటీషన్‌వేయడం, చివరకు జైలుకు పంపడం, న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం బెయిల్‌ ఇవ్వకపోడమే కోర్టు స్థాయిలో జరిగిన తొలి తప్పుగా న్యాయవాదులు భావిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఇంతకన్న ఎక్కువ నేర తీవ్రత ఉన్న కేసుల్లో కూడా రిమాండ్‌ తిరస్కరించి నిందితులను విడుదల చేసిన ఉదారణలు ఉన్నాయని, లీగల్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈక్రమంలో తక్కువ శిక్షకు లోబడి కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తున్న వ్యక్తిపై రాజకీయంగా, ప్రముఖ నాయకుడిపై ఇంత కఠిన చర్యలు తీసుకోవడం ఎంత వరకు సహజం. ఎంత వరకు న్యాయ సమ్మతం? అనే సందేహాలు న్యాయవాదుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, అంబటి రాంబాబు తరుపున న్యాయవాదులు ఇమినిటీషన్‌ పిటీషన్‌ కూడా కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లో అంబటి రాంబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా కనీస మానవీయ వసతులు కల్పించాలని కోర్టును కోరారు. దీనిలో ముఖ్యంగా ఏసీ సౌకర్యం, ఫ్రిజ్, వైద్య సదుపాయాలు, అవసరమైతే వైద్యుల సహాయం అందించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం కస్టడిలో ఉన్న వ్యక్తికి హక్కులు ఉంటానేని పేర్కొన్నారు. కనీస వసతులు కల్పించడం చట్టబద్ధమైన హక్కుని వారు చెబుతున్నారు. ఈపరిణామాలు చూస్తే చట్టం అమలవుతుందా, చట్టం పేరుతో అధికారం ప్రదర్శించబడుతుందా అనే ప్రశ్న న్యాయవాదులు, ప్రజల్లో వెలువడుతంది. గురువారం కోర్టుల్లో జరుగనున్న ఈకేసు దిశను మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో పోలీసు చర్యలకు మార్గదర్శంగా మారనున్నాయనేది లీగల్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 

Search
Categories
Read More
Andhra Pradesh
వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు
వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు...
By Chennaiah Kati 2026-06-26 16:55:48 0 97
Karnataka
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
By Bharat Aawaz 2025-07-17 06:47:46 0 2K
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
మంగళవారం మదనపల్లెలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-01 03:44:35 0 178
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.
సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-03 06:25:46 0 191
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com