"లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత”|

0
191

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

 ఈ కేసులో శామీర్‌పేట్ ఎంఆర్ఓ (తహసీల్దార్)సుచరిత  పై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

భూ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను ముందుకు జరిపేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో ట్రాప్ నిర్వహించి, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారని సమాచారం.

దాడుల అనంతరం అధికారులు తహసీల్దార్ కార్యాలయం మరియు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేపట్టారు.

ఈ సందర్భంగా సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారని, ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం అధికారులు పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఆగిరిపల్లి పోతవరప్పాడు లో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు...  ...
By Rajini Kumari 2025-12-22 08:08:29 2 988
Andhra Pradesh
కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల...
By Pagadala Venkateswar 2026-04-08 05:53:28 0 174
Andhra Pradesh
నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రవిచంద్ర గారికి సత్కారం
*నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారిని వారి నివాసంలో...
By Rajini Kumari 2025-12-24 10:50:42 0 243
Andhra Pradesh
మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు
*మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు*      *సెక్యూరిటీ, శానిటేషన్...
By Rajini Kumari 2026-02-23 10:23:51 0 206
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com