Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.

0
207

Andhra

Case Filed Against Vidadala Rajani

గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత

రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి

 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు

ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.

 

కేసు వివరాల్లోకి వెళితే... గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ... ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళతామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై కూడా పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై... నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేశ్ పై కేసులు నమోదయ్యాయి. అంబటికి మేజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు. 

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను...
By Sunka Santhosh 2026-04-29 16:52:23 0 193
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:56:56 0 183
Andhra Pradesh
నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.
బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా...
By Gadiyapudi Narendra 2026-02-11 17:01:04 0 226
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 319
Telangana
ఇండ్లా నిర్మాణం కొనసాగిస్తునే... మూవీ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నా కొండారెడ్డి పెదమల...
ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) - ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి....
By Ponnala Srinivasrao 2026-07-01 04:41:25 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com