నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.

0
224

బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంట అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారంక్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెటర్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సిహెచ్ రోశయ్యలో తో పాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత కమిటీ ఆధ్వర్యంలో యువ క్రీడాకారుల కోసం నెట్స్ ప్రాక్టీస్ నిమిత్తం గ్రౌండ్ కేటాయించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారుల కోసం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేందుకు స్థలాన్ని కేటాయించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ,కలెక్టర్ వినోద్ కుమార్ లకు మా నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. నూతనంగా ఎంపికైన బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ప్రజా ప్రతినిధులు,సీనియర్ క్రికెట్ క్రీడాకారుల సలహాలు, సహకారాలు, అందించాలని ఆయన కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
చేయూత సామజిక భద్రత పింఛన్ల కొరకు దరఖాస్తుల స్వీకారణ : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆగస్టు 8, 2026: చేయూత సామాజిక భద్రత పింఛన్ల కొరకు అర్హులైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి...
By Avunoori Mahesh 2026-08-08 13:05:03 0 152
Andhra Pradesh
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం –3వ డివిజన్‌లో పర్యటించిన...
By Rajini Kumari 2026-01-10 13:27:06 0 223
Telangana
జూన్ 2న సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత ప్రారంభం
🎤కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-21 03:39:51 0 558
SURAKSHA
Apoorva IAS: Transforming Governance Through Public Service
From district administration and public health to agriculture, rural development and disaster...
By Lokeshwari Panthadi 2026-07-25 12:35:23 0 243
Andhra Pradesh
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-04-05 13:11:41 0 299
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com