Anil Kumar Singhal: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ... రవిచంద్రకు బాధ్యతలు.

0
204

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు 

సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్రకు అదనపు బాధ్యతలు

 

నేడు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 1న) ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

 

1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్, 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

 

కాగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

Search
Categories
Read More
Telangana
రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ...
By Thativar Shivaji 2026-01-26 15:27:51 0 743
Puducherry
Heritage Revived: Grand Canal Restoration Phase II
The iconic Grand Canal, which historically divides the French and Indian Quarters, is undergoing...
By Dunna Jessicaruth 2026-05-14 11:02:12 0 183
Andhra Pradesh
సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడాలి
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు...
By Boiena Rajesh 2026-09-04 11:34:15 0 80
Andhra Pradesh
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం ముండ్లమూరు మండలం, ఈదర...
By Chennaiah Kati 2026-07-03 14:00:57 0 94
Andhra Pradesh
కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*   *నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు...
By Rajini Kumari 2026-01-10 13:24:43 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com