Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.

0
378

తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌ 

ఈ నెల 28,29 తేదీలలో ఇద్దరు భక్తుల నుంచి నగదు, విలువైన వస్తువులు చోరి చేసిన వైనం

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన టూటౌన్ పోలీసులు

తిరుమలలో భక్తులను మాటలతో బురిడి కొట్టించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శ్రీరాముడు తెలిపిన సమాచారం మేరకు..తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, హనుమకొండ జిల్లాకు చెందిన మండ నవీన్‌ కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. 

 

ఈ నెల 28న కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను పీఏసీ -5 వద్ద పరిచయం చేసుకున్న నిందితులు, మరుసటి రోజు అంటే 29న తెలంగాణకు చెందిన మరో భక్తుడితో కల్యాణకట్ట షెడ్ల పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసుకున్నారు. భక్తుల నమ్మకాన్ని పొందిన అనంతరం వారి లగేజీ బ్యాగులను మాయమాటలతో స్వాధీనం చేసుకుని అందులోని నగదు, విలువైన వస్తువులను చోరీ చేశారు. 

 

ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాంభగీచా కార్‌ పార్కింగ్‌ వద్ద నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ.45వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Search
Categories
Read More
Telangana
నారాయణపేట జిల్లాలో దారుణ 
భరత్ అవాజ్  సూర్యమోహన్        నారాయణపేట జిల్లాలో దారుణ ...
By Vanmoj Suryamohan 2026-07-24 02:37:00 0 187
Telangana
రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని...
By Nookapangu Manikanta 2026-04-25 11:47:01 0 181
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్
పాలకొండ మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్య...
By Boiena Rajesh 2026-05-01 10:12:40 0 286
Goa
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and Alleged Corruption
Outrage Grows Over Illegal Land Filling in Taleigao: Activists Decry Environmental Damage and...
By BMA ADMIN 2025-05-21 08:54:16 0 2K
Andhra Pradesh
పోలియో రహిత సమాజమే మా లక్ష్యం
పోలియో రహిత సమాజమే మన లక్ష్యం.. ఈరోజు తర్లుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో,...
By Chennaiah Kati 2026-06-28 05:59:02 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com