నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |

0
401

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో డయల్ -100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. టెంపుల్ అల్వాల్ లోని శ్రీకృష్ణ రెసిడెన్సి నివాసి, స్వర్ణకారుడైన వరుగంటి సురేష్ కుమార్ తన దుకాణంలో దొంగతనం జరిగినట్టు సమాచారం అందించారు. 

 

సమాచారం అందుకున్న వెంటనే అల్వాల్ పోలీస్ లు అల్వాల్ లోని జిఎన్ఆర్ హాస్పటల్ సమీపంలో ఉన్న మమతా సాయి జువెలరీ దుకాణానికి చేరుకున్నారు. 

 

దొంగలు దుకాణం షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. దుకాణం లోపల గాజు అద్దాలు పగిలిపోయి ఉండడమే కాకుండా, వెండి ఆభరణాల పెట్టెలు చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 1.4 కిలోల బరువు గల 43 పెట్టెల వెండి పట్టీలను దుండగులు అపహరించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 

 

మొదటిసారిగా ఘటన స్థలంలోనే FIR:

 

ఇటీవల పోలీస్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. నేరం జరిగిన చోట నుంచే కేసు నమోదు చేసే ప్రక్రియను అల్వాల్ పోలీసులు అమలు చేశారు. బాధితుడి ఫిర్యాదును ఘటన స్థలంలోనే స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందచేశారు. ఈ కేసును అల్వాల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఆశీర్వాద కా దియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ...
By Santhosh Kumar 2026-09-17 17:58:20 0 90
Andhra Pradesh
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-01-14 07:54:50 1 952
Telangana
నిజామాబాద్
రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు డివిజన్లో పర్యటించి, మైనర్ వర్క్స్ ని క్లియర్ చేయించి, మెయిన్...
By Sadaq Sadaq 2026-06-26 06:21:48 1 248
Andhra Pradesh
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
By Mobbu Venkatramana 2026-03-03 08:10:38 1 279
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజ‌య‌వాడ* *27-01-2026*   *స్క్రోలింగ్ పాయింట్స్*   *ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-01-27 11:49:44 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com