Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా.

0
184

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా

27-01-2026 Tue 15:46 | Andhra

Pawan Kalyan Pithapuram Tour Postponed

 

రేపటి నుంచి కొనసాగాల్సిన పవన్ పిఠాపురం పర్యటన

టౌన్, వార్డు, బూత్ స్థాయి పార్టీ ఎన్నికల నేపథ్యంలో పర్యటన వాయిదా

తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్న జనసైనికులు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన రేపు ప్రారంభం కావాల్సి ఉండగా, అకస్మాత్తుగా వాయిదా పడింది. పిఠాపురంలో పార్టీకి సంబంధించి టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీ ఎన్నికలు ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగనుండటంతో, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

 

 

పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ఈసారి తొలిసారిగా సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకునే విధానాన్ని జనసేన అమలు చేస్తోంది. రేపు (జనవరి 28) నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30...
By Sadaq Sadaq 2026-02-23 13:42:45 0 235
Telangana
సార్
కొడంగల్ లో ని తన స్వగృహంలో సార్ ప్రక్రియలో పాల్గొని ఏంయుమరేషన్ ఫామ్ ను బిఎల్ ఓ కు అందజేసిన...
By Vanmoj Suryamohan 2026-07-22 05:32:24 0 193
Telangana
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)...
By Sidhu Maroju 2026-03-17 07:25:04 0 243
Andhra Pradesh
చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
By SivaNagendra Annapareddy 2025-12-15 10:31:27 0 317
SURAKSHA
Maharashtra Police Launch Digital Citizen-Centric Portal
The Maharashtra Police are revolutionizing public governance by transitioning vital...
By Lokeshwari Panthadi 2026-07-04 08:02:30 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com