లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|

0
237

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది కంటి యశ్వంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కె.ఆర్.జి (లేట్ కందికంటి రవికుమార్ గౌడ్)  మెమోరియల్ తొలి బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ క్లోజింగ్ సెర్మనీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, బాక్స్ క్రికెట్ మ్యాచ్‌లను తిలకించడంతో పాటు స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మొగ్గు చూపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

అలాగే లేట్ కందికంటి రవికుమార్ గౌడ్  స్మృతిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ అభినందనీయమని, క్రీడల ద్వారా వారి జ్ఞాపకాన్ని నిలుపుకోవడం గొప్ప విషయమని ఎమ్మెల్యే  తెలిపారు. విజేతలకు మరియు పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్  శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీ అనిల్ కిషోర్ గౌడ్, నేమూరి శ్రీధర్ గౌడ్, అరుణ్ రావు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం...
By Pinnehasan Odela 2026-04-08 14:11:05 0 242
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 251
Telangana
SI's charity for children who lost their mother!
MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due...
By Bheeshman King 2026-07-03 07:55:18 0 613
Telangana
"రాఘవేంద్ర కాలనీలో అభివృద్ధికి కొత్త అడుగు – కమిటీ హాల్ ప్రారంభం”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని...
By Sidhu Maroju 2026-04-12 16:19:49 0 196
Andhra Pradesh
మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*ఆత్మకూరు, జనవరి 5:*   *అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్...
By Rajini Kumari 2026-01-05 11:49:53 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com