"రాఘవేంద్ర కాలనీలో అభివృద్ధికి కొత్త అడుగు – కమిటీ హాల్ ప్రారంభం”.|

0
195

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ఘనంగా ప్రారంభమైంది. ఎం.పి లాడ్స్ ఫండ్స్ మరియు కాలనీ సభ్యుల సహకారంతో నిర్మితమైన ఈ హాల్‌ను మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. స్థానిక ప్రజల ఐక్యతతో ఈ కమిటీ హాల్ నిర్మాణం సాధ్యమైందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారాయణ, బీజేపీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

స్థానికులకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కమిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 2K
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ...
By Kothuru Murali 2026-02-26 12:57:29 0 176
Andhra Pradesh
,కూటమి ప్రభుత్వం రైతన్నల కల,
- _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు...
By Boya Dasthagiri 2026-03-24 00:50:52 0 392
Andhra Pradesh
మద్యం మత్తు లో బావిలో పడి యువకుడి మృతి
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమాపురంలో శనివారం రాత్రి రక్షణ కవచం లేని బావి ఓ యువకుడి...
By John Baji 2025-12-28 07:17:48 0 232
Andhra Pradesh
వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న...
By Kothuru Murali 2026-01-08 12:58:02 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com