Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.

0
223

పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం

మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా రూ.44 లక్షలు విరాళం

టీటీడీలోని వివిధ ట్రస్టులకు ఈ విరాళాలను కేటాయింపు

తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, అలాగే ఓ విద్యాసంస్థల అధినేత వేర్వేరుగా స్వామివారికి కోట్లాది రూపాయలను కానుకగా సమర్పించారు. ఈ విరాళాలను టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ సేవా ట్రస్టులకు కేటాయించారు.

 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ, టీటీడీ ట్రస్టులకు మొత్తం రూ. 2.50 కోట్లు విరాళంగా ఇచ్చింది. సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ విరాళంలో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, విద్యాదాన ట్రస్టుకు చెరో రూ.75 లక్షలు ఉన్నాయి. అలాగే బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, అన్నప్రసాదం, గో సంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25 లక్షలు చొప్పున అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ విరాళం అందించిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.

 

మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం ఆయన రూ. 44 లక్షలు అందించారు. నేడు మంత్రి లోకేశ్‌ పేరిట టీటీడీ అన్నప్రసాద కేంద్రంలో ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అర్ధరాత్రి పరామర్శ హోమ్ మినిస్టర్ అనిత
*కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత*   *కార్యకర్త ఫోన్...
By Rajini Kumari 2026-01-05 11:53:18 0 270
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 492
Tripura
Tripura Tightens School Oversight to Boost Education
In a major push to enhance primary education standards, the Tripura School Education Department...
By Lokeshwari Panthadi 2026-07-03 04:54:19 0 88
Andhra Pradesh
ఆరోగ్య కేంద్రంలో దుర్వాసన, టెక్నీషియన్‌పై ఆఫీసర్ దుర్భాష: ఉన్నతాధికారులకు ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని రామసముద్రం చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రయోగశాలను 25...
By Pagadala Venkateswar 2026-06-20 13:26:40 0 111
Telangana
ప్రమాదంలో గాయపడిన పెగడపల్లి AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెగడపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన AMC డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడిని...
By Avunoori Mahesh 2026-04-26 13:07:16 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com