ప్లాస్టిక్ కవర్స్ వాడటాన్ని ప్రతి ఒక్కరు మానేయాలి : కమిషనర్

0
166

కర్నూలు సిటీ : 

ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

నగరంలోని ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి పౌరుడు స్వచ్చందంగా నిషేధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరపాలక కార్యాలయం నుండి ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీ వరకు ప్లాస్టిక్ వాడకాన్ని  నియంత్రించేందుకు చైతన్యం కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కౌన్సిల్ హాల్లో నమస్తే కార్యక్రమంలో భాగంగా మురుగునాళాలు, సెప్టిక్ ట్యాంకుల కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లను అందించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధి విధానాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వాడకం నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం నిత్య జీవితంలో ఒక భాగమైందని, ఏ ఇంట్లో చూసినా ఇవి ఎక్కువగా కనబడుతున్నాయన్నారు. రీ సైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్‌ సంచులు అతిగా వాడి ఎక్కువగా పడేస్తున్నారన్నారు. దీంతో భవిష్యత్తులో చాలా ప్రమాదం సంభవిస్తుందని పర్యావరణ హితులు హెచ్చరిస్తున్నారన్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఫ్లెక్సీ తయారీలో వాడుతున్నారని... ముఖ్యంగా క్యాడ్మియం, సీసం వాడకం వల్ల అవి భూమిలో కరిగిపోవడంలేదని తెలిపారు. దీంతో జంతువులు తెలియక ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయన్నారు. ఏటా భారీ సంఖ్యలో పక్షులు, జీవులు ఈ ప్లాస్టిక్‌ బారిన పడి నశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, ఎస్‌ఈ విష్ణుమూర్తి, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కోఆర్డినేషన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.,

Search
Categories
Read More
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 336
Andhra Pradesh
Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!
Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన...
By Pagadala Venkateswar 2026-07-22 11:26:05 0 26
Telangana
"పానిక్ బయింగ్ వద్దు - పెట్రోల్ భయం వద్దు: హైదరాబాద్‌లో ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్!
హైదరాబాద్ : హైదరాబాద్  నగరం లో నెలకొన్న ఇంధన కొరత ప్రధానంగా సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల...
By Sidhu Maroju 2026-04-30 14:07:17 0 419
Telangana
మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ...
By Sidhu Maroju 2026-06-23 08:07:55 0 111
Business & Finance
Heavy Rain Alert May Boost Jharkhand's Farm Economy
The India Meteorological Department (IMD) has issued an orange alert for heavy rainfall and...
By Navya Sree 2026-07-01 07:00:50 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com