Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.

0
249

రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం

వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి

నా మనోవేదన తీర్చిన శ్రీనివాసుడికి మొక్కుబడి యాత్ర అని వ్యాఖ్య

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టైన సందర్భంలో శ్రీనివాసుడికి మొక్కుకున్నానని, తాజాగా ఈ మొక్కు చెల్లించుకోవడానికి సంకల్ప యాత్ర చేపడుతున్నానని వివరించారు. ‘నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు షాద్ నగర్ లోని తన నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

 

‘దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించా. తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. చంద్రబాబు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే ఆయనపై కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కు తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నా మొక్కుబడి చెల్లింపు’ అని బండ్ల గణేశ్‌ తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్
సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక...
By Ratna Sekhar 2026-02-11 14:26:06 0 390
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-10 04:31:11 0 171
SURAKSHA
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity ​Transforming Policing Through Compassion,...
By Kalaga Sailaja 2026-07-08 09:51:07 0 170
Andhra Pradesh
జై సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   *జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-23 12:01:42 0 203
Telangana
పట్ట పగలే కరీంనగర్ PMJ జూవెలర్స్ లో బంగారం భారీ చోరి
బైక్ పెనా వచ్చి తుపాకీ తో కాల్పులు జరిపిన దుండగులు వర్కర్స్ పే దాడి చేసి బాత్రూం లో కట్టివేసి...
By Bouth Arun 2026-05-03 13:14:54 0 346
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com