రైలు వన్ యాప్:: రైల్వే శాఖ

0
184

కర్నూలు ; 

రైల్ వన్ యాప్
రైలు టికెట్‌పై రిబేటు
3 శాతం ప్రకటించిన రైల్వే శాఖ
మార్చి తర్వాత యూటీఎస్ రద్దు

కర్నూలు : రైల్వే శాఖ పలు రకాల రైలు సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చింది. ఇందులో భాగంగా రైలు ప్రయాణికులకు మరింత చేరువగా రైల్ వన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ టికెట్‌పై 3 శాతం రిబేటు ప్రకటించింది. ఈ యాప్ ద్వారా బుధవారం నుంచి టికెట్ల రిబేటు విధానాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో అన్ రిజర్వ్‌డ్ టికెట్ల జారీ కోసం రైల్వే శాఖ 'యూటీఎస్' (UTS) పేరిట ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ఆ అప్లికేషన్‌పై రైల్వే శాఖ ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో ప్రజల ఆదరణ పొందలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రైల్వే ఆన్‌లైన్ సేవలను ఒక గొడుగు కిందకు తెచ్చే క్రమంలో గత ఏడాది జూలైలో రైల్ వన్ యాప్‌ను ప్రారంభించింది. ఆ యాప్ ద్వారా రైలు టికెట్లపై ఎటువంటి డిస్కౌంట్ ప్రకటించలేదు. సాధారణంగా టికెట్లు జారీ ఆప్షన్ రైల్ వన్ యాప్‌లో ఉండటంతో యూటీఎస్ అవసరం లేకుండాపోయింది. దీంతో మార్చి నుంచి ఆ యాప్ రద్దు చేసే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఈ మేరకు యూటీఎస్ యాప్‌లో ఆన్‌లైన్ జనరల్ టికెట్ పై ఇచ్చే 3 శాతం డిస్కౌంట్‌ను రైల్ వన్ యాప్‌లో సంక్రాంతి కానుకగా రైల్వే శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
అన్ని రకాల టికెట్లపై డిస్కౌంట్... యూటీఎస్ యాప్‌లో కేవలం అన్ రిజర్వ్‌డ్ టికెట్లు జారీ చేసేవారు. అలాగే వాలెట్ డబ్బుతో బుక్ చేసే అన్ రిజర్వ్‌డ్ టికెట్లపై మాత్రమే 3 శాతం రిబేటు లభించేది. ప్రస్తుతం రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ తో పాటు రిజర్వ్‌డ్ టికెట్లపై కూడా 3 శాతం రిబేటు ఇవ్వడానికి రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. రైల్వే శాఖ టికెట్లు జారీ చేసే కమర్షియల్ శాఖ సిబ్బందిని, కౌంటర్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లను తగ్గించే లక్ష్యంతో దశాబ్దం కిందట యూటీఎస్ యాప్‌ను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. కేవలం ఈ యాప్ అన్ రిజర్వ్‌డ్ టికెట్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు రిజర్వుడు టికెట్ల కోసం ఆయా రైల్వే స్టేషన్లలోని పీఆర్‌ఎస్ కౌంటర్లకు రావడమే కాకుండా ఐఆర్‌సీటీసీ, ఇతర ప్రైవేటు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడం వంటివి చేసేవారు. దీనిని అధిగమిస్తూ రైల్వే శాఖ సరికొత్తగా రైల్ వన్ యాప్‌ను డిజైన్ చేసింది. ఇతర సేవలను కూడా దీని ద్వారా ప్రయాణికులకు అందించి ఆదరణ పొందే యత్నంలో భాగంగానే రైల్ వన్ యాప్ ద్వారా అన్ని రకాల టికెట్ల బుకింగ్ పై 3 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

Search
Categories
Read More
SURAKSHA
"Beyond the Badge: The Unwavering Resolve of SP P. Jagadeesh"
The Sentinel of Anantapur: IPS P. Jagadeesh and His Mission for a Safer Tomorrow Sub Headline:...
By Kalaga Sailaja 2026-07-14 05:02:49 0 74
Andhra Pradesh
కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం కేసినేని చిన్ని
*ప్రెస్ నోట్*   9-5-2026   *కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం*    ...
By Rajini Kumari 2026-05-09 14:02:34 0 152
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 173
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 154
Andhra Pradesh
నూతన ప్రింట్ షాప్ ప్రారంభోత్సవం
బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకన నూతన ప్రింట్ ఆన్ షాపును...
By Vadlamudi NagaVenkat 2026-03-16 09:05:17 0 547
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com