హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!

0
249

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ. 70 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ వివిధ క్రికెట్ సంఘాలు సోమవారం జింఖానా గ్రౌండ్‌లో మెరుపు ధర్నాకు దిగాయి.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌సీఏలోని పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా రూ. 70 కోట్ల నిధులను విశాఖ ఇండస్ట్రీస్‌కు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.

క్రికెట్ అభివృద్ధికి వాడాల్సిన నిధులను ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనకారులు సంఘటనా స్థలంలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తీవ్రంగా తోసిపుచ్చారు. ఆందోళనల మధ్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 

"నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క చెక్కు పైనా సంతకం చేయలేదు. విశాఖ కంపెనీకి జరిగిన 69 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారం నేను బాధ్యతలు తీసుకోకముందే పూర్తయింది. ఇది గతంలో జరిగిన ప్రాసెస్" అని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సదరు కంపెనీకి డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, న్యాయస్థాన ఉత్తర్వుల మేరకే ఆ ప్రక్రియ జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పక్షాల వాదనలతో హెచ్‌సీఏలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
రూ. 2.23 కోట్ల వ్యయంతో అల్వాల్ రూపు రేఖలు మార్చేస్తాం : అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే...
By Sidhu Maroju 2026-02-10 15:27:18 0 231
Andhra Pradesh
అగ్ని ప్రమాద చర్యలు జాగ్రత్తలు తప్పక పాటించాలి
*విజయవాడ నగరపాలక సంస్థ*     *23-02-2026*   *అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు...
By Rajini Kumari 2026-02-23 12:47:15 0 234
Andhra Pradesh
మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా...
By Pagadala Venkateswar 2026-06-01 04:29:27 0 169
Andhra Pradesh
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ ప్రయాగ్రాజ్
శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ (ప్రయాగ్‌రాజ్) ఇంద్రకీలాద్రి సందర్శించారు  ...
By Rajini Kumari 2026-01-01 10:37:18 0 288
Telangana
ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..
 ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా? ‎గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్...
By Ponnala Srinivasrao 2026-09-06 04:40:55 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com