Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్.

0
242

 

 

Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్

17-01-2026 Sat 09:51 | Andhra

 

Nara Lokesh Played Cricket at Mangalagiri Premier League

భోగి ఎస్టేట్స్‌లో ఉత్కంఠ భరితంగా సాగుతున్న మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్) సీజన్‌ - 4 క్రికెట్‌ పోటీలు

వల్లభనేని వెంకట్రావ్‌ యూత్‌, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు టాస్ వేసిన మంత్రి 

సరదాగా కాసేపు క్రికెట్ ఆడానన్న లోకేశ్

ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేసిన మంత్రి  

మంగళగిరి బైపాస్ రోడ్డులోని భోగి ఎస్టేట్స్‌లో సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సీజన్ - 4 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

 

ఎంపీఎల్ - 4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ చివరి మ్యాచ్‌గా వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు మంత్రి లోకేశ్ టాస్ వేశారు. అనంతరం సరదాగా ఆయన కాసేపు క్రికెట్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ఆటలో పాల్గొనగానే యువత కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

 

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నట్టు, సరదాగా కాసేపు క్రికెట్ ఆడినట్లు లోకేశ్ పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Telangana
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి
గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన...
By Bheeshman King 2026-07-04 12:34:04 0 826
Andhra Pradesh
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.
బాపట్ల బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి...
By Vadlamudi NagaVenkat 2026-04-10 09:59:39 0 181
Andhra Pradesh
కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-12 11:10:36 0 325
Andhra Pradesh
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
By Mobbu Venkatramana 2026-02-23 15:04:22 0 301
West Bengal
West Bengal Advances Digital Governance and Services
West Bengal has continued to strengthen digital governance and public service delivery through...
By Fathima Safa 2026-06-25 10:08:34 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com