జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.

0
178

బాపట్ల

బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గుదే రాజారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న బియ్యం దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజారావు మాట్లాడుతూ,పేద ప్రజలకు కిలో రూపాయి లేదా రెండు రూపాయలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని మధ్యవర్తులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.పేదల వద్ద నుండి కేవలం ₹10లకే బియ్యాన్ని సేకరించి, వాటిని రైస్ మిల్లర్లకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతున్నా డీఎస్ఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. ఇది అధికారుల పనితీరుకే నిదర్శనమని, ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని విమర్శించారు. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంలో విఫలమైనందుకు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై ఈ క్రింది చర్యలు తీసుకోవాలని రాజారావు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఈ దందాపై విజిలెన్స్ లేదా సిఐడి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలి. పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే మధ్యవర్తులను, సహకరిస్తున్న రైస్ మిల్లర్లను కఠినంగా శిక్షించాలి. పేదల ఆహార హక్కులపై జరుగుతున్న ఈ దాడిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, ప్రభుత్వం స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
బీజేపీలో చేరనున్న తెలంగాణ లోని కీలక నేత కుటుంబం.!
ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి...
By Ponnala Srinivasrao 2026-05-06 05:11:10 0 170
Andhra Pradesh
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
*ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *మ‌రో ప‌దిహేను రోజుల్లో నిర్మాణం...
By Rajini Kumari 2026-01-10 13:08:24 0 206
Andhra Pradesh
చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం
చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి,...
By Kothuru Murali 2026-01-20 14:01:44 0 567
Telangana
"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు...
By Sidhu Maroju 2026-04-29 09:28:21 0 385
Andhra Pradesh
దేశ నిర్మాణంలో "అనే నేను": కలెక్టర్
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు....
By Boiena Rajesh 2026-08-10 10:17:10 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com