సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన

1
608

సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ పరిశీలన

 


బాపట్ల: బాపట్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోమవారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్‌లో నారావారిపల్లె వెళ్తున్న క్రమంలో తీర ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిని వారు నిశితంగా పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రూ. 97 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో బీచ్ పరిసరాలను పర్యాటక స్వర్గధామంగా మార్చే పనులు వేగవంతం అయ్యాయి. సూర్యలంకను కేవలం విహార కేంద్రంగానే కాకుండా, బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలతో కూడిన గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. తీర ప్రాంత పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.
శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు...
By Pagadala Venkateswar 2026-05-22 12:36:15 0 141
Telangana
ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు ,...
By Nookapangu Manikanta 2026-05-14 12:59:40 0 336
Telangana
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
By Sidhu Maroju 2025-06-17 10:46:20 0 2K
Andhra Pradesh
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం ముండ్లమూరు మండలం, ఈదర...
By Chennaiah Kati 2026-07-03 14:00:57 0 94
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com