పేకాట కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు.

0
175

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని అన్నారు.అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు రాత్రి–పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిపారు. పేకాట కోడిపందాలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి...
By Chennaiah Kati 2026-01-20 07:00:06 0 268
Andhra Pradesh
ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష మోసం: మేజారి మురళీధర్‌పై సత్య ఆరోపణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఇంటి పట్టాల పేరుతో రూ.1 లక్ష తీసుకుని మోసం చేశాడని మేజారి...
By Pagadala Venkateswar 2026-05-01 04:04:53 0 67
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Andhra Pradesh
విజయనగరం RDOగా సుధాసాగర్
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్...
By Boiena Rajesh 2026-03-17 13:13:58 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com