మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

0
213

*ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు*

 

*క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే...*

 

*మున్సిపల్ కమిషనర్.. ఎమ్మెల్యే రాము టీం సభ్యుల మధ్య... ఉత్సాహభరితంగా జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్*

 

*సమర్థవంతులు ఉంటే అభివృద్ధి జరుగుతుందనడానికి....మున్సిపల్ అధికారులే నిదర్శనం*

 

గుడివాడ జనవరి10: గుడివాడ ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో అందరం కలిసి గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని ఆయన పిలుపునిచ్చారు.

 

 

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు మరియు సచివాలయ సిబ్బంది వివిధ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు పోటీల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... వివిధ క్రీడా పోటీల్లో స్వయంగా పాల్గొని ఉద్యోగులను ఉత్సాహపరిచారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ టీం సభ్యులతో కలిసి... ఎమ్మెల్యే రాము టీం సభ్యులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు.

 

అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన సాంప్రదాయ క్రీడా పోటీలు, ప్రత్యేక విభాగాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులను అందించారు .

 

ముందుగా జరిగిన సంబరాల ముగింపు సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ...ఉద్యోగుల్లో ఇంత టాలెంట్ ఉందా అని ఈరోజు ప్రత్యక్షంగా చూశారన్నారు. ఉద్యోగులందరూ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం హర్షనీయమన్నారు. 

 

గుడివాడ అభివృద్ధి కోసం ఇదే ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. అధికారులు ఉద్యోగులు, తాము అందరం కలిసి పనిచేస్తే ఎంత అభివృద్ధి సాధించుకోవచ్చో గుడివాడలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.

 

అందరిని సమన్వయం చేస్తూ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న కమిషనర్ మనోహర్ ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అభినందించారు. అంతరం కలిసి కొత్త ఏడాదిలో మరింత అభివృద్ధి సాధించుకుందామని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య , చేకూరు జగన్మోహన రావు, కడియాల గణేష్, మున్సిపల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్ ప్రారంభం
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అడ్మిషన్ కావాలనుకుంటే ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-06-30 08:43:17 0 155
BMA
Fighting the Surge of Deepfakes in Election Coverage
With critical elections unfolding worldwide, reporters are facing an unprecedented wave of...
By Dunna Jessicaruth 2026-05-20 05:58:28 0 266
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bheeshman King 2026-04-26 00:47:30 0 888
Kerala
Kerala's Digital Governance Revolution and E-Governance Growth
Kerala continues to strengthen its digital governance framework through innovative e-governance...
By Fathima Safa 2026-06-17 10:55:42 0 202
Telangana
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన...
By Sidhu Maroju 2026-04-05 08:26:18 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com