మెదక్ జిల్లా గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి... సీఎం కప్పు ర్యాలీ నిర్వహణ... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

0
263

మెదక్ జిల్లా గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి కప్ టార్చ్ ర్యాలీని వివిధ శాఖల జిల్లా అధికారులు తో కలిసి టార్చిని వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు.కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ సి.యం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనని తెలిపారు.గత సంవత్సరం మాదిరిగానే  ఈ సంవత్సరం కూడా సీఎం కప్ ‌ క్రీడా కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా ‌ ముందుకు పోతుందని గుర్తు చేశారు.పల్లెలోని యువత,విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని దీనివల్ల శారీరక దృఢత్వం తో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి జిల్లా లోనే కాక జాతీయ,అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు,కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్.సి.సి క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ర్యాలీ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు వరకు కొనసాగింది.

Search
Categories
Read More
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 843
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bittu Bittu 2026-04-10 11:43:46 0 431
Andhra Pradesh
విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విజయవాడ: రాష్ట్రంలో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్...
By Bharat Aawaz 2025-10-14 06:22:48 0 957
Rajasthan
बदली बिना बरखा: राजस्थान सूखे की चिंता बढ़ी”
राजस्थान में इन दिनों #मौसम बदली से घेरायो है, पर बारिश नी होय रही। जयपुर सहित कई जिलां में...
By Pooja Patil 2025-09-12 04:41:26 0 198
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
*విజయవాడ నగరపాలక సంస్థ*   *వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*   *విజయవాడ నగరపాలక...
By Rajini Kumari 2025-12-30 10:37:21 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com