ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల,  బాపట్ల  నాలుగవ  రోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమం

0
450

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల,  బాపట్ల  నాలుగవ  రోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమం

 

బాపట్ల: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల,  బాపట్ల  నాలుగవ  రోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లచే మూలపాలెం గ్రామంలో ఉదయం తృణధాన్యాలు మరియు చిరుధాన్యాలు విలువ జోడింపు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తృణధాన్యాలతో తక్షణ పెసరట్టు మరియు రవ్వ దోశ మిక్స్ వంటి వాటిపై అవగాహన మరియు ప్రదర్శన జరిగినది. చిరుధాన్యాలతో లడ్డు, రాగి లడ్డు, వినియోగానికి తయారుగా ఉన్న ఉత్పత్తులు ప్రదర్శించారు. తదుపరి మధ్యాహ్నం  కిచెన్ గార్డెన్ కార్యక్రమలో ఇంటి పెరట్లో ఆకుకూరలు, కూరగాయల సాగు ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు అని కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ ఇ.గౌతమి తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకాయ, టమాట, పచ్చిమిర్చి మొదలగు కూరగాయ మొక్కలు నాటడం, గోంగూర, తోటకూర విత్తనాలు పాఠశాల ప్రాంగణంలో మరియు ఇండ్లలో వేయడం జరిగినది. ఈ కార్యక్రమం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సర్దార్ బేగ్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎన్ వినోద (అసోసియేట్ ప్రొఫెసర్) డాక్టర్ ఇ. గౌతమి మరియు డాక్టర్ సిహెచ్ సోమేశ్వరరావు, ఎం లావణ్య,.డాక్టర్ వినోద్ బాబు తదితర కళాశాల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, గ్రామస్తులు మరియు ఎన్ ఎస్ ఎస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం 50 శాతం రిజర్వేషన్ల...
By Sidhu Maroju 2025-09-11 15:03:56 0 375
Andhra Pradesh
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: బహుజన యువసేన.
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని విలువైన APIIC ప్రభుత్వ ఖాళీ ప్లాట్లను కొందరు వ్యక్తులు...
By Pagadala Venkateswar 2026-06-23 06:03:51 0 108
SURAKSHA
AI Cameras Drones Make Tamil Nadu Roads Safer for All DriversSafeRoads
: Tamil Nadu Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-02 05:06:15 0 434
Telangana
శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆదివారం...
By Sidhu Maroju 2025-11-09 09:41:44 0 303
Andhra Pradesh
యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
బాపట్ల జిల్లా: యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-27 16:15:04 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com