బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం - కలెక్టర్ 

0
374

బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం . బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించిన విద్యార్థులను అభినందించి. బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.

బాపట్ల: బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు  డిఇఓ  శ్రీనివాస్  తో కలసి  విద్యార్థులు  జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ, "బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని వీరి కృషి, అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మరిన్ని  మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తు విద్యార్థులను ప్రశంసించారు.

 డి ఈ ఓ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీలు (State Level Skill Competition 2025-26) డిసెంబర్ 29, 2025న విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. 10 వృత్తి విభాగాల్లో నిర్వహించిన 
ఈ విజయాలు బాపట్ల జిల్లా విద్యారంగానికి కీర్తి తెచ్చాయని డి ఈ ఓ ఈ సందర్భంగా విజేతలైనకె.అక్షయ,కె.సాయి చరిస్మ్, కె.ఈశ్వరమ్మ,సి హెచ్.వైష్ణవి,పి.ఉన్నవెంకటలక్ష్మి విద్యార్థినిలు అభినందించారు.

ఈ పోటీల్లో ప్రతి విభాగానికి మొదటి స్థానానికి రూ.25,000, రెండవ స్థానానికి రూ.15,000, మూడవ స్థానానికి రూ.10,000 నగదు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ పోటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచారు. వారి వివరాలు:

స్కూల్: జడ్‌పి హైస్కూల్, మేడరమెట్ల
హెడ్‌మాస్టర్: శ్రీమతి టి. అంజనీ దేవి (సంప్రదింపు: 9492813696)
వృత్తి విభాగం: హెల్త్‌కేర్
వృత్తి శిక్షకురాలు: శ్రీమతి కె. రమ్య లత (సంప్రదింపు: 8106998009)
సాధించిన స్థానం: మొదటి స్థానం
నగదు బహుమతి: రూ.25,000

స్కూల్: ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ (బాలికలు), నక్షత్రనగర్
హెడ్‌మాస్టర్: శ్రీమతి జి. రాగిణి
వృత్తి విభాగం: అగ్రికల్చర్
వృత్తి శిక్షకురాలు: శ్రీ సుద్దపల్లి సిరి వెన్నెల  (సంప్రదింపు: 9553541074)
సాధించిన స్థానం: రెండవ స్థానం
నగదు బహుమతి: రూ.15,000

 గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత, వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ, సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు, 

 "మా జిల్లా విద్యార్థులు హెల్త్‌కేర్, అగ్రికల్చర్ విభాగాల్లో రాణించడం సంతోషదాయకం. వీరి విజయం జిల్లా విద్యాశాఖ కృషికి ఫలితం."
గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత తన అభినందనలు తెలిపారు: "బాలికలు వృత్తి నైపుణ్యాల్లో రాణిస్తున్నారు. ఈ విజయం బాలికల సాధికారతకు నిదర్శనం."
వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ మాట్లాడుతూ: "వృత్తి శిక్షణ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ విజయాలు మరిన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి."
సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు కూడా విద్యార్థుల కృషిని, శిక్షణను కొనియాడారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:32:36 0 213
Andhra Pradesh
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు.
    వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌...
By Pagadala Venkateswar 2026-06-11 05:41:59 0 110
Telangana
కర్తవ్యం–కరుణ కలిసిన దృశ్యం 🙏
*అమ్మ ఓటు వేయడానికి వెల్లడంతో...!!*   *పసిబిడ్డ ను లాలిస్తున్న కానిస్టేబుల్ అనిత...*...
By CM_ Krishna 2025-12-17 09:47:13 0 406
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 219
Andhra Pradesh
ధనకొండ గంగమ్మ గుడి లో దొంగతనం.
శుక్రవారం అర్థరాత్రి మదనపల్లెలోని ధనకొండ గంగమ్మ గుడిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిమ్మనపల్లి...
By Pagadala Venkateswar 2026-04-11 06:34:08 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com