డిసెంబర్ 31 తో పథకం ముగింపు !!

0
201

కర్నూలు:  డిసెంబర్ 31తో 'SPREE' పథకం ముగింపు

నమోదు కాని సంస్థలు, కార్మికులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి) ‘Spree-2025’ పథకం ఈ నెల డిసెంబర్ 31తో ముగియనుంది. జూలై 1న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో సంస్థలు, కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఏపీలో సుమారు 2.5 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐసిలో చేరారని, దీంతో వారికి ఆరోగ్యసేవలు, సామాజిక భద్రత లభిస్తున్నాయని ESIC ఏపీ ప్రాంతీయ డైరెక్టర్ మల్ల రామారావు తెలిపారు. అలాగే, 2,000కు పైగా సంస్థలకు గత కాలపు బకాయిలు, పాత రికార్డుల పరిశీలన మినహాయింపుతో ఉపశమనం లభించిందన్నారు. 10 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలకు వర్తింపు 10 మందికిపైగా ఉద్యోగులు ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, మాన్పవర్ ఏజెన్సీలు, ప్రైవేట్ విద్యాసంస్థలు తదితర సంస్థలు తప్పనిసరిగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఈఎస్ఐసి అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అకాల వర్షానికి నేలకొరిగిన బీరపంట
చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీరపంటకు తీవ్ర నష్టం కలిగించింది. ఖాన్ సాబ్...
By Kothuru Murali 2026-03-20 06:15:29 0 157
Kerala
High Command’s "New Face" Strategy for Kerala
The appointment of V.D. Satheesan is being viewed by analysts as a strategic shift by the...
By Dunna Jessicaruth 2026-05-14 10:13:28 0 127
Andhra Pradesh
అన్నమయ్య: పదో తరగతి పరీక్షలు: 22, 149 మంది విద్యార్థులు హాజరు.
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-14 03:14:24 0 159
Business & Finance
Hassle-Free ESI Return Filing Services
Simplify your ESI return filing with reliable online services designed for businesses across...
By Navya Sree 2026-07-08 10:10:18 0 64
Telangana
మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి,...
By Pinnehasan Odela 2026-01-14 17:58:26 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com