రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశం

0
276

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

 

రోడ్డు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశం

 

శుక్రవారం నాడు విజయవాడ రూరల్ మండలం ఇబ్రహీంపట్నం ప్రాంతం డాన్ బాస్కో స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. 

 

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏడిసిపి గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ జోన్ ఏసిపి దుర్గారావు, ట్రాఫిక్ ఏసిపి రామచంద్రరావు,రూరల్ డిఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో శనివారం సాయంత్రం 6 గంటలకు రోడ్డు ప్రమాదాల నివారణ పై ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో ఉన్న టిప్పర్ల లారీ యజమానులు, డ్రైవర్లు అందర్నీ పిలిపించి వారికి పలు సూచనలు జారీ చేశారు..

 

టిప్పర్ లారీలకు స్పీడ్ లిమిట్స్ పెట్టాలని, లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఓవర్ లోడ్ తో ప్రయాణించరాదని, లారీలకు జిపిఆర్ఎస్ అమర్చాలని, లారీ డ్రైవర్లకు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని,అలాగే లారీ యజమానులు అందరూ లారీల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయించాలని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపడతామని, రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే లారీ యజమానులతో పాటు డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు తప్పవని ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఈ సందర్భంగా విలేకరుల సమావేశం లో తెలిపారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : సోమవారం NEET ఎగ్జామ్ కు ఫ్రీ బస్
తెలంగాణ 21-06-2026 రోజున నీట్ ఎగ్జామ్  రాసేవారికి TGSRTC ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. పల్లె...
By Sunka Santhosh 2026-06-20 13:31:59 0 197
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన...
By John Baji 2026-01-01 02:58:16 0 372
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి...
By Kothuru Murali 2026-02-23 12:10:00 0 177
Andhra Pradesh
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-03-02 10:28:55 0 200
Andhra Pradesh
ప్రగతి బాటలో పల్లెలు
ప్రగతి బాటలో పల్లెలు.   పరుగులు పెడుతున్న అభివృద్ధి.   -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-04-17 15:17:38 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com