ప్రగతి బాటలో పల్లెలు

0
149

ప్రగతి బాటలో పల్లెలు.

 

పరుగులు పెడుతున్న అభివృద్ధి.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

రూ.92 లక్షలతో కొత్తూరు తాడేపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు ప్రారంభం.

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 17.04.2026.

 

కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పట్టాయని, పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. 

 

పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామంలో రూ.92 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను, డ్రెయిన్లను, గోకులం షెడ్లను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం గారు శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

కొత్తూరు తాడేపల్లిలో శివారు వేమవరంలో రూ.51.90 లక్షలతో 566 మీటర్ల పొడవుగా సీసీ రోడ్లు, 967 మీటర్ల పొడవునా డ్రెయిన్లు, కొత్తూరు తాడేపల్లిలో రూ.24 లక్షలతో 340 మీటర్ల సీసీ రోడ్లు, 275 మీటర్ల డ్రెయిన్లు, కొత్తూరులో రూ.16 లక్షలతో 125 మీటర్లు సీసీ రోడ్లు, 219 మీటర్ల పొడవునా డ్రెయిన్లను నిర్మించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గంలో పల్లెపండుగ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.32.92 కోట్లు కేటాయించామన్నారు. 

 

పల్లెపండుగ కింద కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగ పరచి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు.ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం - మద్దులూరి మహేంద్రనాథ్
నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ...
By Vadlamudi NagaVenkat 2026-03-08 14:24:42 0 1K
Telangana
Telangana Expands Electric Vehicle Manufacturing Hub
Telangana is strengthening its position as a leading electric vehicle (EV) manufacturing hub by...
By Fathima Safa 2026-06-29 11:54:06 0 143
Telangana
"మైనంపల్లి ఆదేశాలతో అల్వాల్‌లో లక్ష్మీకాంత్ రెడ్డి పాదయాత్ర"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాలు...
By Sidhu Maroju 2026-06-03 08:31:28 0 247
Madhya Pradesh
Madhya Pradesh Advances Renewable Energy Growth in 2026
Madhya Pradesh continues to strengthen its renewable energy sector by expanding large-scale solar...
By Fathima Safa 2026-07-06 08:02:57 0 134
Assam
Natural Gas Supply Expansion Strengthens Assam Growth
Assam is witnessing significant progress in its energy sector through the expansion of natural...
By Fathima Safa 2026-06-24 06:16:18 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com