పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం

0
234

*పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*

 

*మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్*

 

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, భద్రతాయుతంగా నిర్వహించేందుకు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్య కూడళ్లలో, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో, దేవాలయాలు, హోటళ్లు, ప్రధాన రహదారుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు నైట్ ప్యాట్రోలింగ్‌ను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించారు.ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. మండలంలోని ప్రతి జంక్షన్‌ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలన్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, స్టంట్లు వేయడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు..మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఎవరైనా అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శబ్ద కాలుష్యం, గొడవలు, రోడ్లపై గుమిగూడటం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే చర్యలకు అనుమతి లేదన్నారు. యువత తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కోరారు..అనుమానాస్పద లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ, “ప్రజల సహకారంతోనే శాంతియుత నూతన సంవత్సరం వేడుకలు సాధ్యమవుతాయి” అని ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు.

Search
Categories
Read More
Health & Fitness
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection As...
By BMA ADMIN 2025-05-20 05:49:20 0 2K
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 215
Telangana
మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!
​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు...
By Bheeshman King 2026-02-27 12:01:03 0 606
BMA
Health Journalism: Press Exposes Pharma Scams Safely
Journalists investigating pharmaceutical price-gouging, unregulated clinical trials, and...
By JoinBMA 2026-08-21 08:12:13 0 176
Andhra Pradesh
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి
 రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:45:57 1 493
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com