గుంటూరు విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు. గుంటూరు రేంజ్ ఐడి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమం నీర్వహించారు.

0
827

గుంటూరు జిల్లా పోలీస్...* *30.12.2025* _*// "సంకల్పం" కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, సంకల్పం కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ❇️ ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్ నాశనం అవుతుందని, చదువుపై ఏకాగ్రత కోల్పోయి పరీక్షల్లో విఫలమవుతారని, ఉన్నత చదువుల్లో రాణించలేరని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మనోవేదన కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విద్యార్థులకు సూచించారు. ❇️ సరదా కోసం లేదా ఆకతాయి తనంతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, మొదట అలవాటుగా మొదలై తరువాత వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. 👉 ఈ అవగాహన కార్యక్రమాలలో * ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఇతర పోలీస్ అధికారులు KL యూనివర్సిటీ నందు * సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు, వట్టి చెరుకూరు సీఐ రామా నాయక్ గార్లు మలినేని కాలేజీ, పుల్లడిగుంట మరియు ప్రియదర్శిని కాలేజీ, 5వ మైలు నందు * వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ఎస్సై రాంబాబు గార్లు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలని నందు విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ❇️ గుంటూరు జిల్లా పోలీస్ శాఖ యువత భవిష్యత్తును పరిరక్షించడమే లక్ష్యంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రంలో SIR సమీక్ష సమావేశం.
రామసముద్రం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బుధవారం ఎమ్మెల్యే ఎం. షాజహాన్...
By Pagadala Venkateswar 2026-06-11 05:30:22 0 87
Telangana
ఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదు...కల్వకుంట్ల కవిత
*వే టు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత...
By Ponnala Srinivasrao 2026-05-16 05:02:26 1 141
Telangana
తెలంగాణ పోలీస్ వారి యచ్చరిక
ఈ పాస్వర్డ్స్ పెట్టుకుంటే చిక్కుల్లో పడట్టే 
By Midathapalli Kiran Kumar 2026-04-26 07:25:53 0 272
Puducherry
Puducherry Strengthens Public Health and Disease Control
Puducherry continues to strengthen its public healthcare system through comprehensive disease...
By Fathima Safa 2026-06-29 08:44:46 0 71
Andhra Pradesh
క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్
25.12.2025.   క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ...
By Rajini Kumari 2025-12-25 10:41:49 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com