ఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదు...కల్వకుంట్ల కవిత

1
140

*వే టు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు* 

‎ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..

‎రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం ,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలి

‎ఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే సమస్య

‎ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదు

‎అంతర్గతంగా నేను చెప్పిన అభిప్రాయాలను బయటపెట్టి నన్ను బయటకు బయటకు వెళ్లేలా చేశారు

‎ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సరే తెలంగాణ రక్షణ సేనదే అధికారం

‎తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేశానని చరిత్రలో నా పేరు ఉండాలన్నదే నా కోరిక

‎చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే నాలో మార్పు వచ్చింది

‎రాష్ట్రంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశాం

‎  🔹నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాక నాలో చాలా మార్పు వచ్చింది. 

‎🔹ఎవరికీ నచ్చకపోయినా సరే మనకు నచ్చింది చేయాలన్నది నేను గుర్తించాను. 

‎🔹కేసీఆర్ గారు చాలా గొప్ప మనిషి. ఇందులో నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు.

‎🔹రాదనుకున్న రాష్ట్రాన్ని ఆయన సాధించి పెట్టారు. 

‎🔹ఉద్యమ కేసీఆర్ గారితో నాకు ఎలాంటి సమస్య లేదు. 

‎🔹ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారితోనే నాతో పాటు చాలా మందికి సమస్య వచ్చింది. 

‎🔹బీఆర్ఎస్ లో చాలా ఢిపరెంట్ గా వ్యూ చెప్పేది నేనే ఉండే. 

‎🔹ఇంటర్నల్ గా నా అభిప్రాయాలు ఎప్పుడు చెబుతుండేది నేను ఇంటర్నల్ గా చెప్పిన అభిప్రాయాన్ని బయటకు వచ్చేలా చేశారు. 

‎🔹దాంతో ఇంకా నేను నా అభిప్రాయానికి బయటకు చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు. 

‎🔹ఇక అప్పటి నుంచి నేను ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అనుకొనే పార్టీ పెట్టాను. 

‎🔹చుక్క రక్తం చిందించకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో మార్పు తెస్తానని అంబేడ్కర్ గారు అన్నారు. 

‎🔹అదే విధంగా నేను కూడా రాజకీయ పార్టీ ద్వారా మంచి మార్పు తేవాలని వచ్చాను. 

‎🔹కచ్చితంగా నన్ను ప్రజలు దీవిస్తారు, ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. 

‎🔹రాజకీయాల్లో కచ్చితంగా వ్యూహాలు ఉండాలి. నేను కేసీఆర్ గారి వద్దే వ్యూహాలు నేర్చుకున్నాను. 

‎🔹ఆడపిల్లలు రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయితే వారికి ఏమీ చేతకాదని ముద్ర వేస్తారు. 

‎🔹అందుకే కచ్చితంగా సక్సెస్ కావాలని నేను మంచి స్ట్రాటజిస్ తో ముందుకు వెళ్తున్నా. 

‎🔹మన రాష్ట్ర మహిళలు, భారత మహిళ బరువు నా మీద ఉంది. నేను సక్సెస్ అయితే వాళ్లు ఇంకా ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తారు. 

‎🔹నేను ఏ సమస్య వచ్చిన సరే పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఆడపిల్లలు డిప్రెస్ కావద్దు. 

Search
Categories
Read More
Rajasthan
Monsoon Hits Rajasthan: IMD Issues Alert For 20 Districts
The Southwest Monsoon has officially intensified across Rajasthan, bringing a much-needed respite...
By Lokeshwari Panthadi 2026-06-27 05:50:10 0 67
Andhra Pradesh
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:57:52 0 198
Telangana
సీఎం పదవికి పాలేరు ఎమ్మెల్యే తో ముప్పుంది: నారాయణ
కరెన్సీ ప్రభుత్వాలతో తమ గెలుపును ఆపలేరని CPI జాతీయ కమిషన్ ఛైర్మన్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు....
By Krishna Balina 2026-02-10 08:00:21 0 375
Telangana
పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24...
By MERIGE MALLESH 2026-04-17 07:34:12 0 1K
Andhra Pradesh
పుంగనూరుపశువులకు ఉచిత వైద్యం: అన్నమయ్య జిల్లాలో శిబిరం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం...
By Kothuru Murali 2026-05-08 14:27:35 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com