ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ప్రసాదాల పంపిణీ

0
228

*ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ప్రసాదాలు పంపిణీ*

 

*మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో భక్తులకు ప్రసాదాల పంపిణీ*

 

*10 వేల మందికి పైగా ప్రసాదాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు*

 

*ప్రతి ఏటా స్థానిక నాయకులతో ప్రసాదాలు పంపిణీ చేయిస్తున్న మంత్రి నారా లోకేష్*

 

మంగళగిరి టౌన్: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన భక్తులకు మంత్రి నారా లోకేష్ సహకారంతో టీడీపీ నాయకులు మంగళవారం ప్రసాదాలు పంపిణీ చేశారు. తెల్లవారుజామున నుంచే స్వామి దర్శనంకు వచ్చిన 10 వేల మందికి పైగా భక్తులకు ప్రసాదాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రతి ఏటా భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ కూటమి పాలనలోనే ఆలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. లక్ష్మినరసింహస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిచారు. ప్రసాదాలు పంపిణీ చేసిన వారిలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, రాష్ట్ర పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, గోవాడ దుర్గారావు, వంగర సదాశివరావు, నల్లగొండ పరమేశ్వరరావు, బైరుబోయిన శ్రీనివాస్ యాదవ్, గోసాల రాఘవ, దివి లక్ష్మి, నల్లగోర్ల శివరామకృష్ణ, బాపనపల్లి వాసు, గంజి లక్ష్మయ్య, ఆకురాతి లక్ష్మణ్, ఇండ్ల రజనీ, గోవాడ వెంకట లక్ష్మి, కొత్త శ్రీనివాసరావు, తెల్లమేకల నాగేశ్వరరావు, చావలి ఉల్లయ్య యాదవ్, అవ్వారు సుబ్బారావు, పిన్నబోయిన నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|
హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై...
By Sidhu Maroju 2025-11-28 06:27:32 0 273
Andhra Pradesh
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి,...
By Pagadala Venkateswar 2026-05-08 05:19:27 0 135
Andhra Pradesh
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
By Karapati Gopi 2026-06-20 10:16:38 0 401
SURAKSHA
Manish Jain IAS: Driving Water Governance with Vision
A distinguished 1994-batch IAS officer of the West Bengal cadre, Shri Manish Jain serves as the...
By Lokeshwari Panthadi 2026-07-28 05:38:32 0 139
Andhra Pradesh
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా...
By Pagadala Venkateswar 2026-08-18 07:24:52 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com