శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
254

*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*శ్రీ కొండలమ్మ అమ్మవారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన....ఎమ్మెల్యే రాము*

 

గుడివాడ డిసెంబర్ 30: శ్రీ కొండలమ్మ వారి కరుణాకటాక్షాలతో కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.

 

ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థాన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ఆవిష్కరించారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము , కూటమి నాయకులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి కంకణాలు కట్టి ప్రసాదం అందించారు.

 

అమ్మవారి ఆశీస్సులతో గడిచిన ఏడాది కాలంలో గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. కొత్త సంవత్సరంలో కూడా గుడివాడ అభివృద్ధి పనులు అమ్మవారి దీవెనలతో దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఆలయ ఈ.వో ఆకుల కొండలరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు,పండ్రాజు సాంబశివరావు,మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, రామిదేని వేణు, పెద్దూ వీరభద్రరావు, యార్లగడ్డ సుధారాణి, సింగవరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం 2030 నాటికి క్యాన్సర్...
By Pagadala Venkateswar 2026-01-30 05:59:00 0 191
Telangana
మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళి
డా వివేక్ వెంకటస్వామి  మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్....
By Avunoori Mahesh 2026-04-14 05:41:04 0 256
Andhra Pradesh
పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే...
By Kothuru Murali 2026-05-07 12:05:52 0 136
Telangana
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి....
By Pinnehasan Odela 2026-01-16 09:09:19 0 310
Telangana
Telangana medchal mla malla Reddy focus on A.P
ఏపీపై తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫోకస్.. తిరుపతిలో కొత్త వర్సిటీ  : ఏపీలో విద్యాసంస్థల...
By G k Nookala 2026-07-11 08:13:30 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com