2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..

0
231

2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఏపీలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని వెల్లడించారు. మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్‌ఫోన్లు రికవరీ.. వంటి అనేక వాటిలో పురోగతి సాధించామన్నారు డీజీపీ. కొత్త ఏడాదిలో నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వచ్చే పది సంవత్సరాలలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దాని మీద రెండు రోజులు వర్క్‌షాపు నిర్వహిస్తామని డీజీపీ హరీశ్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామన్నారు. సంక్రాంతి తర్వాత ఈ వర్క్‌షాపు ఉంటుందన్నారు. ఇటీవల కీలక కేసులను ప్రస్తావించడంతోపాటుగా.. ఎలా చేధించారో వివరిస్తామన్నారు.

'సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్ షాపు ద్వారా అందరికీ తెలియజేస్తాం. చట్టానికి అందరూ సమానమే. వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవడమే మా విధి. సేఫ్ ఏరియా అనుకుని కొందరు నక్సలైట్లు ఏపీలోకి వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వారందరినీ పట్టుకున్నాం.' అని డీజీపీ హరీశ్ కుమార్ తెలిపారు.

సైబర్ నేరాల గురించి డీజీపీ మాట్లాడారు. చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయన్నారు. మోసం జరిగిన వెంటనే.. ఆ దేశానికి నగదు వెళ్లిపోతుందన్నారు. ఇటువంటి కేసుల్లో నగదు తిరిగి రావడం అనేది కష్టమైన పని, ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేంద్రం నివేదికలో 36వ స్థానంలో ఏపీ ఉందనే వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ అన్నారు. ఎందుకంటే అది పాత సిస్టమ్ అని, వారి డేటాకు, మన డేటాకు మధ్య తేడా వల్ల అలా వచ్చిందని తెలిపారు. ఇప్పుడు చూస్తే డ్యాష్‌ బోర్డులో ఏపీ ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు.

మహిళలకు రక్షణ, గంజాయి రవాణ, నేరాల నియంత్రణకు ఏపీ పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నామని డీజీపీ తెలిపారు. తాము ఎప్పుడు మహిళలకు రక్షణగానే ఉంటామని, అన్ని ఘటనలనూ జనరలైజ్ చేసి చూడకూడదని చెప్పారు. 'పేకాట క్లబ్‌లు నిర్వహించడం నేరం. అందుకే చర్యలు తీసుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని జూదాలు నిర్వహించకూడదు.' అని డీజీపీ అన్నారు.

నిందితులను రోడ్లపై నడిపించిన వ్యవహారంపై డీజీపీ హరీశ్ కుమార్ స్పందించారు. కోర్టులో హాజరుపరిచే సమయానికి పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో లేవన్నారు. ఈ కారణంగా కొన్ని చోట్ల నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉండాలనే లక్ష్యంతో పోలీసులు పని చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...
By Boiena Rajesh 2026-08-27 03:50:04 0 125
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 2K
Andhra Pradesh
గ్రామీణ రోడ్లు–హైవే కలయికల్లో భద్రత కట్టుదిట్టం: కలెక్టర్.
గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-28 14:42:33 0 235
Andhra Pradesh
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
By Kothuru Murali 2026-01-20 13:35:21 0 237
Andhra Pradesh
సిఫార్సులకే పెద్దపీట తాగిందుకు మంచినీళ్లు లేవు
*క్యూలైన్లో భక్తుల కష్టాలు.*   *త్రాగేందుకు నీళ్లు లేక భక్తుల అవస్థలు*  ...
By Rajini Kumari 2025-12-30 12:30:50 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com