కర్నూలు జిల్లా కురవ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన కర్నూలు ఎంపీ !!

0
252

కర్నూలు :

కర్నూలు నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కురువలకు సన్మాన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు... కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కురువలను సన్మానించిన ఎంపీ నాగరాజు గారు, అనంతరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు... ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడుతూ కురువలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.. కురువలు రాజకీయంగా చైతన్యం చెందాలని,  రాజకీయంగా ఎదిగినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కురువలు అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నారు.. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ టికెట్ తో పాటు ఒక ఎమ్మెల్యేటికెట్ సాధించుకోవాలన్నారు...ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు పర్ల శ్రీనివాసులు గారు , రామకృష్ణ గారు,ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు గారు , దిశా కమిటీ మెంబెర్ దేవ శంకర్ గారు, మరియు కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.
చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్...
By Shyamala Yadagiri 2026-04-16 08:36:28 0 208
Andhra Pradesh
పాత కక్షలు: వైసీపీ నేతపై కత్తితో దాడి, పలువురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే...
By Pagadala Venkateswar 2026-03-04 11:36:18 0 142
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By Hari Krishna 2025-12-13 10:56:23 0 339
Telangana
కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:12:01 0 257
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com