పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ !!

0
245

కర్నూలు : కర్నూలు సిటీ : 

ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్  ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన ... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మరియు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.  

క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని , పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు  క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారులు తెలిపారు. 

ఈ సంధర్బంగా  ఆదివారం కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  మైదానంలో  సివిల్, ఎఆర్ మరియు ఎపిఎస్పీ  పోలీసులకు నిర్వహించిన  పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను  కర్నూలు జిల్లా ఎస్పీ గారు , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు కలిసి  ప్రారంభించారు.  

క్రికెట్ ఆడి సిబ్బందిని  ఉత్సాహపరిచారు. 

జిల్లా సివిల్ , ఎఆర్  పోలీసుల జట్టు కు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ  గారు  వ్యవహరించారు. 

ఎపిఎస్పీ  పోలీసుల జట్టుకు కెప్టెన్ గా ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్  గారు వ్యవహరించారు. 

ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ టీం గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  పోలీసులు ,  రన్నర్ టీం గా కర్నూలు జిల్లా పోలీసులు  గెలుపొందారు. 

ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఎపిఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు .   

శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్ నెస్ తో  ఉండడానికి,  మానసిక నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు. 

క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు.  గెలుపు , ఓటములు సహజమన్నారు.

 కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించడానికి, ఫిజికల్ ఫిట్ నెస్  ఉంటూ  ప్రజలకు  మేరుగైన  సేవలందించే ఉద్దేశ్యంతో  పోలీసులు బాగా పని చేయాలని ఈ ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో   కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ లు ఎస్ . ఎం. భాషా, సుధాకర్ రెడ్డి,  వెంకటరమణ,  సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ , ఎస్డీఆర్ ఎఫ్  పోలీసులు  ఉన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
By Kothuru Murali 2026-03-13 08:57:48 0 144
Telangana
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి
లక్షింపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ ఓడి వో కార్యాలయంల ఈసీ శైలజ ...
By Bonagiri RaviShankar 2026-05-30 08:46:11 0 190
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల :
కర్నూలు : *ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్*ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు 13...
By Hari Krishna 2026-01-03 16:20:38 0 250
Andhra Pradesh
అత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు చేసిన ఎస్ఐ గారు
పుంగనూరులో ఈనెల మూడున వెంకటేశ్వర థియేటర్ పక్కన చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద...
By Kothuru Murali 2026-01-07 13:00:08 0 175
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com