కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్

0
217

*ప్రచుర‌ణార్థం* *24-12-2025*

 

క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు అభినంద‌న‌లు తెలిపిన ఎంపీ కేశినేని , ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్

 

విజ‌య‌వాడ‌: సుప్రీంకోర్టులో భార‌త ప్ర‌భుత్వ అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా (ASG) నియ‌మితులైన సీనియ‌ర్ న్యాయ‌వాది, టిడిపి మాజీ రాజ్య‌స‌భ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. బుధ‌వారం ల‌బ్బీపేట‌లోని ఆయ‌న నివాసంలో క‌లిసి శాలువాతో స‌త్క‌రించి కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను బ‌హుక‌రించారు. రాజ్య‌స‌భ స‌భ్యునిగా విశేష సేవ‌లందించిన క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర, ఇక‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వం త‌రుఫున కీల‌క వాద‌న‌లు వినిపించనుండ‌టం ఎంతో ఆనందంగా వుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. దేశంలోనే ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన ఈ ప‌ద‌విలో తెలుగు వ్య‌క్తి...నియ‌మితులు కావ‌టం ఎంతో గ‌ర్వంగా వుంద‌ని ఎమ్మెల్యే గ‌ద్దె అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
By Pagadala Venkateswar 2026-03-18 03:06:58 0 209
Andhra Pradesh
కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు
ఆగస్టు 23: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం...
By VALLERU SIMHADRI 2026-08-23 09:38:53 0 312
Jharkhand
Jharkhand Strengthens Education and Skill Development
Jharkhand continues to enhance education and skill development through improved school...
By Fathima Safa 2026-07-03 15:37:35 0 82
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:46:49 0 266
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com