"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"

0
267

చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు మహిళా సంఘాలు గళమెత్తాయి. సుమారు 1.30 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని, తక్షణమే ఆ సొమ్మును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ గారికి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పోలవరం జిల్లా గిరిజన సంఘం నాయకులు సురేష్ మాట్లాడుతూ. 2017 నుండి 2020 మధ్యకాలంలో మండలంలోని 458 మంది సభ్యుల పేరు మీద వారు అప్పు తీసుకోకపోయినా, తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారు. లాగిన్ లో విరిపెర్లమీద అప్పు ఉన్నట్లు చూపిస్తుంది అప్పటి సీసీ, ఏపిఎం, ఏపీడి లు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తుంది.రికార్డుల్లో అప్పులు ఉన్నట్లు చూపిస్తుండటంతో, గత 10 ఏళ్లుగా ఈ పేద మహిళలకు కొత్త అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు కట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు.ఈ సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ , బాధితులతో మాట్లాడి 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

# Yadagiri 

Search
Categories
Read More
Sikkim
International Pilgrimage Yatra Resumes via Sikkim in June 2025
After a five-year hiatus, the Kailash Mansarovar Yatra is slated to resume in June 2025, entering...
By Bharat Aawaz 2025-07-17 07:28:41 0 1K
PRAGATI
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By PRAGATI 2025-04-30 11:44:14 0 6K
Lakshdweep
Lakshadweep Ends 47-Year Prohibition: A New Tourism Era
he Union Territory of Lakshadweep has officially entered a transformative chapter with the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:00:38 0 129
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 251
Andhra Pradesh
పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది....
By Kothuru Murali 2026-04-19 11:23:55 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com