Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.

0
109

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ (సీపీ) స్థలాలపై జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అరికట్టాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని 21 ప్రభుత్వ లేఅవుట్లలో ఉన్న కమ్యూనిటీ పర్పస్ స్థలాలపై వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.

 

ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించి, ఆ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వ్యక్తులపై, అలాగే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

పునీత్ కుమార్ మాట్లాడుతూ, "ప్రజల సామాజిక అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ పర్పస్ స్థలాలను ఆక్రమించడం ప్రజా ద్రోహంతో సమానం. అధికారులు నిద్రమత్తు వీడి ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి. లేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం" అని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి...
By Pulse 2025-06-25 10:04:17 0 1K
Telangana
మే 29న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు గవర్నర్ రాక
🎤భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి...
By Chunarkar Jagadeesh 2026-05-28 17:25:33 0 454
Andhra Pradesh
ఎవర్రా మీరంతా.! పైకి చూసి డెలివరీ పార్శిళ్లు పికప్ అనుకునేరు.. అసలు యవ్వారం వేరుంది
దొంగతనం కూడా దర్జాగా చేసేస్తున్నారు ఇక్కడ ఇద్దరు యువకులు. అది కూడా నడిరోడ్డు మీద అందరూ...
By SivaNagendra Annapareddy 2025-12-16 08:40:01 0 396
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 207
Andhra Pradesh
Chandrababu: ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌.
సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డిగ్రీ చదివిన తన...
By Pagadala Venkateswar 2026-04-02 06:01:59 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com