ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి వర్ధంతి

0
224

ఈరోజు పద్మశ్రీ భానుమతి గారి

  వర్ధంతి 🌹

 

*బహుముఖ ప్రజ్ఞాశాలి.‌‌.."భానుమతీ ",

  రామకృష్ణ...!!

 

*సినిమాల్లో తన పాటలు తానే పాడుకునే

 వారు‌‌..!!

 

భానుమతీ రామకృష్ణ

 ( డీసెంబర్

 24, 2005 సెప్టెంబర్ 7 -1926) దక్షిణ భారత సినిమా నటి,నిర్మా

త, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి,రచయిత్రి, గాయని,సంగీత దర్శకురాలు. 

 

ఈమె ఒంగోలులో జన్మించినభానుమతిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, బొబ్బిలి యుధ్ధం, బాటసారి,మంగమ్మ గారి మనవడు ,

పెళ్ళికానుక ,చింతామణి,సారంగధర,విప్రనారాయణ ' వంటి అనేకవిజయవంతమైన చిత్రా

లలోనటించారు.ఈమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య.శాస్త్రీయ సంగీత కళాకారు

డు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది.

 

తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడారు తర్వాత భరణి స్టూడియోస్ 

బ్యానర్ ద్వారా పలు చిత్రాలు నిర్మించారీ దంప

తులు. భానుమతి రాసిన అత్తగారికథలుతెలు

గు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966...

లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ... పురస్కారం లభించింది.

 

సినీరంగంలో భానుమతి గారిది విలక్షణ వ్యక్తి

త్వం..‌ఆమె గాత్రం ప్రత్యేకమైంది..తన పాటలు

తానే పాడుకునేవారు..చక్కని నృత్య,సంగీత

కళా కారిణి..

 

 

#విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు.

 

#సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల #సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది.

#మిస్సమ్మ, #చెంచులక్ష్మి వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలలో.. ఆమె చివరి నిముషంలో తప్పుకున్నా దర్శక నిర్మాతలు ఆమెకు అహం అని తెగిడినా.. అంజలి,సావిత్రి, జమున వంటి సరికొత్త అందగత్తెలు చిత్ర సీమకు వచ్చినా.. ఆమె ఏ మాత్రం జంకకుండా. పురుషాధిపత్యం కూడిన చిత్ర సీమలో 60 సంవత్సరాలు మకుటం లేని మహా రాణిగా మెలిగారు.. ఆమె రచించిన అత్తగారి కథలు, రంభా చక్రపాణీయం నేటికీ చదువరులను కిత కితలు పెడుతూనే ఉన్నాయి..నాలో నేను అని ఆమె జీవితలోని మరపు రాని మధుర ఘట్టాలను ఎన్నో స్వయంగా రాసుకున్నారు..🌹

Search
Categories
Read More
Tamilnadu
యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025...
By Sidhu Maroju 2025-09-15 17:10:25 0 334
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 10:58:17 0 169
Andhra Pradesh
జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు
విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్...
By Boiena Rajesh 2026-03-01 03:26:18 0 233
Delhi - NCR
Delhi-NCR Expands Women and Child Welfare Initiatives
Delhi-NCR continues to strengthen women and child welfare through expanded healthcare, education,...
By Fathima Safa 2026-07-02 06:24:07 0 227
Andhra Pradesh
పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు
పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ,...
By Kothuru Murali 2026-04-16 17:11:02 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com