తెలంగాణలో ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు...

0
668

ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్ (Upa-Sarpanch)లకు చెక్ పవర్ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది.కాగా, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆ పదవి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా గ్రామాల్లో సర్పంచ్ ఒక పార్టీ అయితే.. ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య విభేదాలు ఏర్పడితే.. అభివృద్ధికి ఆకంటం కలుగుతుందనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు!!!!!!!!!!!!!!!!!!!!!!!
కెరమెరి: కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్‌ డిపోనకు చెందిన...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:24:22 0 247
Telangana
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....
  *గుండాల.... *ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి*   *రూ పది వేలు తీసుకుంటు ఉండగా...
By Gujile Ramu 2026-05-01 05:13:25 0 294
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 407
Andhra Pradesh
పుంగనూరు: అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు: ఆర్టీసీ ఈడీ
కడప జోన్ ఆర్టీసీ ఈడి రాఘవ కుమార్ శుక్రవారం పుంగనూరు ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా సందర్శించి,...
By Kothuru Murali 2026-04-18 09:28:32 0 100
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం
NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి...
By Rajini Kumari 2025-12-25 10:54:08 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com