తెలంగాణలో ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు...

0
669

ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్ (Upa-Sarpanch)లకు చెక్ పవర్ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది.కాగా, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆ పదవి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా గ్రామాల్లో సర్పంచ్ ఒక పార్టీ అయితే.. ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య విభేదాలు ఏర్పడితే.. అభివృద్ధికి ఆకంటం కలుగుతుందనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Search
Categories
Read More
Lakshdweep
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
By Fathima Safa 2026-06-18 09:11:01 0 162
Telangana
పెద్దపల్లి : గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం ...!
అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులో గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం లభమైనట్లు ఎస్సై...
By Sunka Santhosh 2026-06-12 06:17:20 0 100
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-20 11:03:54 0 202
Telangana
ఈటెల ఏమన్నారంటే..!
"రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ...
By Sidhu Maroju 2026-06-26 09:56:16 0 64
Andhra Pradesh
Andhra Pradesh Advances Fisheries and Blue Economy
Andhra Pradesh continues to strengthen its fisheries sector and blue economy through investments...
By Fathima Safa 2026-06-27 11:29:38 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com