TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి

0
233

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్

 

టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు 

 

గొల్లపూడి - 23 డిసెంబర్ 2025

 

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్ గారని, ఆయన పుట్టినరోజు డిసెంబర్ 23ని ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం గొల్లపూడ కార్యాలయంలో చౌదరి చరణ్ సింగ్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, దేశానికి రైతన్నలు చేస్తున్న సేవలు, మద్దతు ధర, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమానికి సరికొత్త వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై చౌదరి చరణ్ సింగ్.. రైతుల కోసం చాలా చేశారని, వారి హక్కుల కోసం పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఆయన రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందువల్ల ఆయన జయంతినే కిసాన్ దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. ఆచార్య ఎన్ జి రంగా, చౌదరి చరణ్ సింగ్, దేవీ లాల్ రైతుల హక్కుల కోసం పోరాడి, భారత రాజకీయాల్లో రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ప్రముఖులుగా వారి సేవలను స్మరించారు. రైతు సాధికారత కోసం శ్రీ చౌదరీ చరణ్ సింగ్ ఎంతగానో పరితపించే వారని, ఆయన చూపిన బాటలో పయనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

Search
Categories
Read More
Telangana
అంగన్‌వాడీ కేంద్రాలు, త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూన్ 11: కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-11 14:52:42 0 265
Nagaland
Nagaland Boosts Youth Employment and Skill Programs
Nagaland is intensifying efforts to create employment opportunities and strengthen skill...
By Fathima Safa 2026-06-25 06:50:10 0 128
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 201
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 339
Bharat Aawaz
Cockroach Janata Party: The Student Revolt Shaking India!
How did a social media meme page turn into a massive student uprising shaking Delhi? Discover the...
By Hazu MD. 2026-06-08 09:01:29 0 488
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com