పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !!
Posted 2025-12-23 02:16:31
0
233
కర్నూలు :
- పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ :
- ఇప్పపటివరకు మీరు సాధారణ పౌరులు (సివిలియన్స్).. ఇకపై పోలీస్ కుటుంబంలోకి అడుగు..
- స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 633 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు 9 నెలల పాటు ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందనున్నారు.
ప్రారంభ కార్యక్రమానికి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ శిక్షణ కళాశాల నిర్వహణకర్త దీపికా పాటిల్, అదనపు కమాండెంట్ నాగేంద్ర రావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, తదితరులు డీఐజీకి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు.
పటాలం శిక్షణ కేంద్రంలో 437 మంది, అలాగే కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రంలో 209 మంది కలిపి మొత్తం 646 మందికి కమాండెంట్ దీపికా పాటిల్ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీఐజీ పలు విషయాలపై నూతన కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని, క్రమశిక్షణతో తరగతులను పూర్తి చేసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మండుటెండల్లో కుడా" పచ్చదనం తో మల్లంపేట హాయ్ రైజ్ మెడోస్ "
ఓ కప్పుడు నగరం శివారు ప్రాంతం,ప్రస్తుతం సిటీ మద్య లో ఉన్నా "హాయ్ రైజ్ మెడోస్...
అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555...
పుంగనూరు: చలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం: మిదింటి కిషోర్
సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి...
Rift in Karnataka Cabinet: Ramalinga Reddy Resigns Over Portfolio Allocation
The newly formed Karnataka government faces its first major political storm as senior leader...
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...