గుడివాడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ సంపూర్ణ నిషేధం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
260

*డిసెంబర్ 1 నుండి గుడివాడలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ బ్యాగులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే*

 

*ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రభుత్వ నినాదం.... వ్యాపారులు,ప్రజలు సహకరించాలి*

 

*విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల... భావితరాలకు పెను నష్టం*

 

*చేతి రుమాలు మాదిరిగానే... ప్రతి ఒక్కరు చేతి సంచిని వినియోగించాలి*

 

గుడివాడ డిసెంబర్ 21:డిసెంబర్ ఒకటో తేదీ నుండి గుడివాడ పరిపాలన సంఘ పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజానికం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ సంచులను ఎమ్మెల్యే రాము అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ... ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్ధాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల భావితరాలకు పెను నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రభుత్వ నినాదం అని ఎమ్మెల్యే రాము చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ పరిపాల సంఘం ప్రతిష్టాత్మకంగా మెప్మా వారి సహకారంతో తిరిగి వినియోగించేలా క్లాత్ సంచులను తయారుచేసి అందుబాటులో తేవడం అభినందనీయం అన్నారు.

 

ప్రజలు చేతులు రుమాలు మాదిరిగానే చేతి సంచిని కూడా వినియోగించాలని సూచించారు. గుడివాడలో ప్లాస్టిక్ అనేది కనబడకుండా చేయాలన్న పురపాలక సంఘ సంకల్పంలో, ప్రజల కూడా భాగస్వామ్యులై తమ వంతు సహకారం అందించి ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో బాలసుబ్రమణ్యం,కమిషనర్ ఎస్. మనోహర్, తాసిల్దార్ కుమార్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు,టిడిపి నాయకులు కంచర్ల సుధాకర్, వేసపోగు ఇమ్మానుయేలు మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
 తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ...
By Thalakokkula Sadanandam 2026-04-25 08:11:48 0 564
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 264
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి చెరువు కట్టపై స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-09-17 05:12:20 0 54
Telangana
అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు...
By Sidhu Maroju 2025-06-12 11:39:04 0 1K
Telangana
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. ఈ చెక్కులు రామగుండం మేయర్...
By Sunka Santhosh 2026-06-03 18:45:22 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com